
ట్విటర్‌లో పోస్టుకే రాజద్రోహం కేసులా?: అమరావతి బహుజన జేఏసీ
ఈనాడు డిజిటల్, అమరావతి: సీఎంపై ట్విటర్‌లో పోస్టు పెట్టిన ఆరోపణపై పవన్‌ఫణి అనే యువకుడిపై రాజద్రోహం, దేశద్రోహం కేసులు పెడతారా అని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులపై మీడియాతో మాట్లాడారు. విచారణ పేరిట దళిత మహిళ ఉమామహేశ్వరిని చిత్రహింసలకు గురిచేసిన చిత్తూరు జిల్లా పోలీసులు, జిల్లా జైలు అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.