డిసెంబరు వరకు మధ్యాహ్న భోజన బిల్లులు చెల్లించాం

వంటవారికి, గుత్తేదారులకు మధ్యాహ్న భోజన పథకం బిల్లులను డిసెంబరు నెల వరకు చెల్లించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నెలా 7వ తేదీనే బిల్లులు చెల్లించేలా చర్యలు

Published : 24 Jan 2022 04:11 IST

విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వంటవారికి, గుత్తేదారులకు మధ్యాహ్న భోజన పథకం బిల్లులను డిసెంబరు నెల వరకు చెల్లించామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రతి నెలా 7వ తేదీనే బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెదేపా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ‘దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో జగనన్న గోరుముద్ద పథకాన్ని అమలుచేస్తున్నాం. వారానికి 5 రోజులు కోడిగుడ్లతో పాటు చిక్కీని అందిస్తున్నాం. తెదేపా హయాంలో మాదిరిగా ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల సాంబారు పెట్టి పిల్లల నిధులను కాజేసే ప్రభుత్వం మాది కాదు. 93% పిల్లలు చక్కని మెనూతో కూడిన భోజనం చేస్తున్నారు. అవగాహన లేకుండా అయ్యన్నపాత్రుడు ఆరోపణలు చేయడం మంచి విధానం కాదు’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని