‘పోలవరం’లో చేపల నిచ్చెన!

డ్యాం నిర్మించడం అంటే నీటికి అడ్డుకట్ట వేసి ఒడిసిపట్టడం. మరి ఆ నీటిలో ఉండే చేపలు ఏమవుతాయి? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా రాకపోకలు సాగిస్తాయి? అనేదానికి ఇంజినీర్లు చూపే పరిష్కారమే ఫిష్‌ ల్యాడర్‌.

Published : 24 Jan 2022 04:11 IST

డ్యాం నిర్మించడం అంటే నీటికి అడ్డుకట్ట వేసి ఒడిసిపట్టడం. మరి ఆ నీటిలో ఉండే చేపలు ఏమవుతాయి? ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఎలా రాకపోకలు సాగిస్తాయి? అనేదానికి ఇంజినీర్లు చూపే పరిష్కారమే ఫిష్‌ ల్యాడర్‌. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా స్పిల్‌వే వద్ద నీటి ఎత్తుకు అనుగుణంగా చేపలు ఇటుఅటు తిరిగేందుకు వీలుగా దాదాపు 252 మీటర్ల పొడవైన ఫిష్‌ ల్యాడర్‌ని నిర్మిస్తున్నారు. ముఖ్యంగా గోదావరికి వరద సమయంలో బంగాళాఖాతం నుంచి విలస చేప నదికి ఎదురీదుతూ వచ్చి అత్యంత అరుదైన పులసగా రూపాంతరం చెందేందుకు సైతం దోహదపడేలా ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరంలో డ్యాం వద్ద పూర్తి కావస్తున్న ఫిష్‌ ల్యాడర్‌ నిర్మాణం ఇది.

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని