ఉత్తమ రిటర్నింగ్‌ అధికారిగా నెల్లూరు కలెక్టర్‌కు అవార్డు

తిరుపతి పార్లమెంటరీ (ఎస్సీ) నియోజకవర్గ ఉపఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌

Published : 24 Jan 2022 04:13 IST

నెల్లూరు(కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: తిరుపతి పార్లమెంటరీ (ఎస్సీ) నియోజకవర్గ ఉపఎన్నికల్లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికల విధులను సమర్థంగా నిర్వహించినందుకు కేంద్ర ఎన్నికల సంఘం ‘బెస్ట్‌ ఎలక్టోరల్‌ ప్రాక్టీసెస్‌ అవార్డ్స్‌-2021 కింద నెల్లూరు జిల్లా కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబును ఉత్తమ రిటర్నింగ్‌ అధికారిగా అవార్డుకు ఎంపిక చేసింది. ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రస్థాయిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్‌ చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల విధుల్లో జిల్లా యంత్రాంగం సహకారం ఎనలేనిదని, వారికే ఈ అవార్డును అంకితం చేస్తున్నానని పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని