అమరావతిని మొగ్గలోనే తుంచేయొద్దు

రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అమరావతిని తమ స్వార్థ రాజకీయాల కోసం మొగ్గలోనే తుంచొద్దని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధాని కోసం మొదటిసారిగా గత ప్రభుత్వం సమీకరణ విధానం...

Published : 26 Jan 2022 04:50 IST

ప్రభుత్వానికి రాజధాని రైతుల విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, తుళ్లూరు గ్రామీణం: రాష్ట్ర భవిష్యత్తును నిర్దేశించే అమరావతిని తమ స్వార్థ రాజకీయాల కోసం మొగ్గలోనే తుంచొద్దని రాజధాని రైతులు విజ్ఞప్తి చేశారు. రాజధాని కోసం మొదటిసారిగా గత ప్రభుత్వం సమీకరణ విధానం ద్వారా భూమిని తీసుకుందని గుర్తుచేశారు. ఈ పద్ధతి అత్యుత్తమమైనదిగా నీతి ఆయోగ్‌ కూడా కొనియాడిందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞతతో ఆలోచించి ఇప్పటికైనా పాలనా వికేంద్రీకరణ నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అమరావతి కోసం తుది వరకు పోరాడతామని తెలిపారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతిలో అన్నదాతలు చేస్తున్న నిరసనలు మంగళవారం 770వ రోజుకు చేరాయి. రాజధాని రైతులు, రైతు కూలీల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నెక్కల్లులో మహిళలు నినాదాలు చేశారు. అమరావతి ఒక ప్రాంత సమస్య కాదు, ఐదు కోట్ల ఆంధ్రుల సమస్య అని తుళ్లూరులో రైతులు ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. కృష్ణాయపాలెం, మందడం, వెలగపూడి, దొండపాడు, పెదపరిమి తదితర గ్రామాల్లో నిరసనలు కొనసాగాయి. శిబిరాల వద్ద రాత్రి 7 గంటలకు కొవ్వొత్తులు, కాగడాలు పట్టుకొని నిరసన తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని