లక్ష దాటిన కరోనా క్రియాశీలక కేసులు

రాష్ట్రంలో కరోనా క్రియాశీలక కేసులు 1,01,396కు చేరాయి. కొత్తగా 13,819 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేట్‌ 29.44%గా నమోదైంది. 12 మంది మరణించారు. ఏరోజుకారోజు పెరిగిపోతోన్న నేపథ్యంలో పాజిటివిటీ రేట్‌ కాస్త తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. మంగళవారం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 46,929 నమూనాలు పరీక్షించారు. వీటి ద్వారా 13,819 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,988.. తక్కువగా విజయనగరం జిల్లాలో 435 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

Published : 26 Jan 2022 04:50 IST

కొత్తగా 13,819 మందికి కొవిడ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కరోనా క్రియాశీలక కేసులు 1,01,396కు చేరాయి. కొత్తగా 13,819 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేట్‌ 29.44%గా నమోదైంది. 12 మంది మరణించారు. ఏరోజుకారోజు పెరిగిపోతోన్న నేపథ్యంలో పాజిటివిటీ రేట్‌ కాస్త తక్కువగా నమోదుకావడం ఇదే తొలిసారి. మంగళవారం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 46,929 నమూనాలు పరీక్షించారు. వీటి ద్వారా 13,819 మందికి వైరస్‌ సోకినట్లు గుర్తించారు. అత్యధికంగా విశాఖపట్నం జిల్లాలో 1,988.. తక్కువగా విజయనగరం జిల్లాలో 435 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని