ఫిబ్రవరి 7 నుంచి సమ్మె చేపడతాం

ఏపీజేఏసీ, పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నుంచి నిర్వహించే నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నోటీసు అందజేసింది.

Published : 28 Jan 2022 02:59 IST

సీఎస్‌కు వైద్య ఉద్యోగుల నోటీసు

ఈనాడు, అమరావతి: ఏపీజేఏసీ, పీఆర్సీ సాధన సమితి పిలుపు మేరకు ఫిబ్రవరి 7 నుంచి నిర్వహించే నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి యునైటెడ్‌ మెడికల్‌ హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నోటీసు అందజేసింది. వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాలతోపాటు జాతీయ ఆరోగ్య మిషన్‌లో పనిచేసే శాశ్వత, ఒప్పంద, సర్వీస్‌ ప్రొవైడర్ల ఉద్యోగులు ఆందోళనలో పాల్గొంటారని నోటీసుల్లో పేర్కొన్నట్లు సంఘం గౌరవాధ్యక్షుడు నాగేశ్వరరావు, అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాసరావు, టి.వెంకటేశ్వర్లు ఓ ప్రకటనలో తెలిపారు. జనవరి 27 నుంచి 30 వరకు నిరాహార దీక్షలు, 31న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, సర్వీస్‌ ప్రొవైడర్‌ ఉద్యోగుల ఛలో తోపాటు ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని పేర్కొన్నారు.

పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని పుర కార్మికుల నిరసనలు

ఈనాడు, అమరావతి: పీఆర్సీపై ప్రభుత్వం జారీ చేసిన జీవోలను రద్దుచేసి, పట్టణ స్థానిక సంస్థల్లో పని చేస్తున్న కార్మికులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ పుర, నగరపాలక సంస్థల్లోని పొరుగు సేవల, ఒప్పంద కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికుల సంక్షేమం కోసం జారీ చేసిన జీవోలు అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో పుర, నగరపాలక సంస్థల్లో, గ్రామ పంచాయతీల్లో ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌ విభాగాల్లోని పొరుగు సేవల, ఒప్పంద కార్మికులు వచ్చే నెల 7 నుంచి సమ్మె చేయనున్నారు. ఈ మేరకు సమ్మె నోటీసులిచ్చామని ఉద్యోగుల సమాఖ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని