గోశాలల అభివృద్ధికి తితిదే సహకారం

దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు.

Updated : 28 Jan 2022 04:15 IST

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: దేశంలోని వివిధ గోశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం తిరుపతిలో తితిదే ఆధ్వర్యంలో నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంతో డ్రైఫ్లవర్‌ టెక్నాలజీతో ఆకర్షణీయంగా రూపొందించిన శ్రీవారి ఫొటోలతో పాటు కీ చైన్లు, పేపర్‌ వెయిట్‌ల విక్రయాలను ప్రారంభించారు. దేశంలోని 15 ప్రముఖ ఆసుపత్రులతో తితిదే ఉద్యోగులకు నగదు రహిత వైద్యం కోసం ఒప్పందం చేసుకున్నారు. కార్యక్రమంలో తితిదే ఈవో జవహర్‌రెడ్డి, ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తిరుమలలో ‘నమామి గోవింద’ బ్రాండ్‌ పేరుతో పంచగవ్య ఉత్పత్తుల విక్రయ కేంద్రం గురువారం ప్రారంభమైంది. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న షాపింగ్‌ కాంప్లెక్స్‌లో దీన్ని ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని