Andhra News: రూ.లక్షల జీతాలు తీసుకుంటూ పిల్లలకు ప్రైవేటు విద్యా?: నారాయణస్వామి
ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని, మీరు చదువు చెప్పే బడులలో మీ పిల్లల్ని ఎందుకు చదివించరని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
టీచర్లపై ఉపముఖ్యమంత్రి ధ్వజం
ఈనాడు డిజిటల్, అమరావతి: ప్రభుత్వ ఉపాధ్యాయులు రూ.లక్షల్లో జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేటు స్కూళ్లలో చదివిస్తున్నారని, మీరు చదువు చెప్పే బడులలో మీ పిల్లల్ని ఎందుకు చదివించరని ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రశ్నించారు. సచివాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు ఏదైనా సమస్య ఉంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని.. రోడ్లెక్కి నిరసన తెలపడం తగదని ఆయన సూచించారు. ‘ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక ఉద్యోగులు సహకరించాలి. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైంది. వారు సీఎం జగన్పై వాడిన భాష సరైనది కాదు. ఇష్టారాజ్యంగా మాట్లాడితే కుదరదు. మదనపల్లెలో అక్రమాలకు పాల్పడ్డ ఎక్సైజ్ సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశాం. అక్రమంగా మద్యం అమ్మాడనే ఆరోపణలు, దిశ కేసు నమోదవడంతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఆబ్కారీశాఖ డీఎం ఆదినారాయణమూర్తిని సస్పెండ్ చేశాం. తప్పుచేసిన వారిని మా ప్రభుత్వం కచ్చితంగా శిక్షిస్తుంది. జిల్లాల విభజనకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలుంటే పరిగణనలోకి తీసుకుంటాం’ అని నారాయణస్వామి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్