CM Jagan: సహస్రాబ్ది ఉత్సవాల్లో నేడు పాల్గొననున్న సీఎం జగన్‌

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి

Updated : 07 Feb 2022 09:41 IST

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలకు హాజరు కానున్నారు. సాయంత్రం 3.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 4.30 గంటలకు శంషాబాద్‌ చేరుకుంటారు. 5 గంటలకు ముచ్చింతల్‌ చేరుకుని సమతామూర్తిని దర్శించుకుంటారు. రాత్రి 7.30 గంటల వరకు సహస్రాబ్ది ఉత్సవాలలో పాల్గొంటారు. అనంతరం విజయవాడ తిరిగి వెళతారు.

నేడు ఆలయాలకు ప్రాణప్రతిష్ఠ..

సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో నేడు మరో కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. సమతామూర్తి కేంద్రంలోని 108 దివ్య దేశాల్లో 33 ఆలయాలకు రుత్వికులు ప్రాణప్రతిష్ఠాపన చేయనున్నారు. యాగశాలలో సంస్కరించిన 33 స్త్రీ దేవతామూర్తులతో శోభాయాత్ర జరగనుంది. యాగశాల నుంచి దివ్యదేశాల వరకు దేవతామూర్తులతో శోభాయాత్రను నిర్వహించనున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని