Andhra News: మంత్రి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలి: ఏపీ పోలీసు అధికారుల సంఘం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాటి విశాఖ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని పరుష పదజాలంతో దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు,

Published : 11 Feb 2022 07:52 IST

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నాటి విశాఖ పర్యటన సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారిని పరుష పదజాలంతో దుర్భాషలాడి దౌర్జన్యం చేసిన రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జె.శ్రీనివాసరావు, కోశాధికారి ఎం.సోమశేఖర్‌రెడ్డి, విజయవాడ, పశ్చిమగోదావరి శాఖల అధ్యక్షులు ఎం.సోమయ్య, ఆర్‌.నాగేశ్వరరావు, కార్యనిర్వాహక సభ్యులు టి.పెద్దయ్య, కె.సుబ్బారావు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఈ ఘటనను పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తోందని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విచారణ చేయించి తగు చర్యలు తీసుకోవడంతోపాటు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని