జస్టిస్‌ ఎం. వెంకటరమణకు ఘన వీడ్కోలు

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన పదవీకాలం శుక్రవారం ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర అధ్యక్షతన వీడ్కోలు

Published : 12 Feb 2022 03:54 IST

న్యాయసేవలను కొనియాడిన హైకోర్టు సీజే

ఈనాడు, అమరావతి: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.వెంకటరమణకు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ఆయన పదవీకాలం శుక్రవారం ముగియడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర అధ్యక్షతన వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. హైకోర్టు న్యాయమూర్తులు, జస్టిస్‌ వెంకటరమణ కుటుంబసభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర మాట్లాడుతూ.. జస్టిస్‌ వెంకటరమణ అందించిన న్యాయసేవలను కొనియాడారు. హైకోర్టులో 2900 కేసులకు పైగా పరిష్కరించారన్నారు. జస్టిస్‌ మఠం వెంకటరమణ మాట్లాడుతూ.. న్యాయస్థానాలకు నిష్పాక్షికత, పారదర్శకత ప్రామాణిక చిహ్నాలన్నారు. అవి ఎప్పుడూ కొనసాగాలని అభిలషించారు. అంతకుముందు ఏజీ ఎస్‌ శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ గంటా రామారావు, సహాయ సొలిసిటర్‌ జనరల్‌ హరినాధ్‌లు జస్టిస్‌ వెంకటరమణ న్యాయసేవలను గుర్తు చేశారు. జస్టిస్‌ వెంకటరమణ దంపతులను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్వర్యంలో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని