ఉద్యోగాల పేరిట మోసం చేస్తున్నారు

హైకోర్టు లెటర్‌హెడ్‌ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్‌ ద్వారా తప్పుడు నోటిఫికేషన్‌, ‘క్లర్క్‌(సీసీ)’ పోస్టుకు కొందరు

Published : 17 Feb 2022 03:25 IST

ఆశావహులూ జాగ్రత్త వహించండి: హైకోర్టు సూచన  

ఈనాడు, అమరావతి: హైకోర్టు లెటర్‌హెడ్‌ను సృష్టించి ఉద్యోగాల పేరుతో కొందరు మోసానికి పాల్పడుతున్నారని, వారిపట్ల జాగ్రత్త వహించాలని ఉద్యోగ ఆశావహులను హైకోర్టు కోరింది. వాట్సాప్‌ ద్వారా తప్పుడు నోటిఫికేషన్‌, ‘క్లర్క్‌(సీసీ)’ పోస్టుకు కొందరు ఎంపికైనట్లు ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. హైకోర్టు, దిగువ కోర్టుల్లో ఆ విధమైన పోస్టు లేదని పేర్కొంది. నేరగాళ్లు/కుట్రదారులపై చర్యలు తీసుకునేందుకు తుళ్లూరు ఠాణాలో ఫిర్యాదు చేశామని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని