Andhra News: ఉపముఖ్యమంత్రి ఇంట.. పెరటి పంట!

ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా పెరటి తోట పెంపకం చేపడుతున్నారు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకున్నా.. దొరికే కొద్దిపాటి సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలోని

Updated : 21 Feb 2022 07:56 IST

కురుపాం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సొంతంగా పెరటి తోట పెంపకం చేపడుతున్నారు.. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి. అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకున్నా.. దొరికే కొద్దిపాటి సమయాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నారు. విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలంలోని చినమేరంగి గ్రామంలోని తన ఇంటి ఆవరణలో పెరటితోట పెంచుతున్నారు. బయటి మార్కెట్లో రసాయన ఎరువులు వినియోగించి పండించిన కూరగాయలు లభిస్తుండడంతో సేంద్రియ పద్ధతిలో పండించాలని నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. సుమారు 20 సెంట్ల స్థలంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, ముల్లంగి, క్యాబేజీ, టమాటా, వంగ, ఆకుకూరలు సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రకృతి సాగు వల్ల భూసారం పాడవ్వకుండా, నాణ్యమైన దిగుబడి వస్తుందని, ఆ పంటలు ఆర్యోగానికీ మేలు చేస్తాయని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని