Prakash Raj: తెరాస జాతీయ రాజకీయ బృందంలో ప్రకాశ్‌రాజ్‌!

జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ ఇందుకోసం కొత్త బృందాన్ని రూపొందిస్తున్నారు. ఆదివారం ముంబయి పర్యటన సందర్భంగా

Updated : 22 Feb 2022 07:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సన్నద్ధమవుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి, తెరాస అధినేత కేసీఆర్‌ ఇందుకోసం కొత్త బృందాన్ని రూపొందిస్తున్నారు. ఆదివారం ముంబయి పర్యటన సందర్భంగా ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఈ పర్యటనలో నటుడు ప్రకాశ్‌రాజ్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పటికే భాజపా వ్యతిరేకతతో పాటు జాతీయ రాజకీయాలపై అవగాహన ఉండడం, ఆంగ్లం, హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషలపై పట్టు ఉన్న దృష్ట్యా ఆయన సేవలను వినియోగించుకోవాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయి బృందంలో ఆయనకు చోటు కల్పించవచ్చని భావిస్తున్నారు. అలాగే రాజ్యసభ స్థానానికి కూడా ఎంపిక చేయవచ్చని సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని