AP PRC: పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి

పీఆర్సీలో ప్రభుత్వం ప్రకటించిన 23శాతం ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అభిప్రాయాల బ్యాలెట్‌లోనూ ఇది బహిర్గతమవుతోందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

Updated : 27 Feb 2022 07:45 IST

 అభిప్రాయాల బ్యాలెట్‌లో వెల్లడి

 యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు

ఈనాడు, అమరావతి: పీఆర్సీలో ప్రభుత్వం ప్రకటించిన 23శాతం ఫిట్‌మెంట్‌పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. అభిప్రాయాల బ్యాలెట్‌లోనూ ఇది బహిర్గతమవుతోందని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (యూటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తెలిపారు. పీఆర్సీపై నిర్వహిస్తున్న బ్యాలెట్‌లో భాగంగా అనంతపురంలో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పీఆర్సీపై అందరూ సంతృప్తి చెందుతున్నారన్న ప్రభుత్వ ప్రకటనల్లో వాస్తవం లేదు. అభిప్రాయాల బ్యాలెట్‌లో వేలాది మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్‌కు మెరుగైన ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని విన్నపాలను పంపించాం. పీఆర్సీ ఉత్తర్వులతోపాటు అశుతోష్‌మిశ్ర నివేదికను బహిర్గతం చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. పీఆర్సీలో రికవరీ లేకుండా ఉత్తర్వులను తక్షణమే ఇవ్వాలి. ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఉన్నత పాఠశాలల్లో 3,4,5 తరగతుల విలీనం, తెలుగు, ఆంగ్లమాధ్యమాల కొనసాగింపుపై ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమవ్వాలి’ అని కోరారు. విద్యా వైజ్ఞానిక రాష్ట్ర మహాసభలు అనంతపురంలో మార్చి 12, 13, 14వ తేదీల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని