Gautam Sawang: వివేకా హత్య కేసు విచారణలో జగన్‌ జోక్యం లేదు

వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు

Updated : 03 Mar 2022 07:02 IST

మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌

ఈనాడు, అమరావతి: వివేకానందరెడ్డి హత్య కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని, నిజాల్ని బయటకు తీసి దోషులకు శిక్షపడేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తనకు ఎప్పుడూ చెప్పేవారని మాజీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. విచారణలో సీఎం జోక్యం చేసుకోలేదని పేర్కొన్నారు. వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి డీజీపీగా ఉన్న సమయంలో తాను మాట్లాడానంటూ కొన్ని వ్యాఖ్యలు పత్రికల్లో వచ్చాయని.. అందులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి, అవినాశ్‌రెడ్డిల కుటుంబాలు తనకు రెండు కళ్లులాంటివని మాత్రమే సీఎం తనకు చెప్పారని అందులో వివరించారు. సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి 2019 సెప్టెంబరులో తనను కలిసినప్పుడు ఇదే విషయాన్ని చెప్పానని పేర్కొన్నారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు ఏనాడూ అవినాశ్‌రెడ్డి, ఈసీ సురేంద్రనాథ్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి తనను కలవలేదని సవాంగ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని