Pegasus: ‘మేం పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనలేదు’

పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను తామెప్పుడూ కొనలేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కోనేరు నాగేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి గతేడాది జులై 25న సమాచార హక్కు చట్టం ద్వారా 

Updated : 19 Mar 2022 07:19 IST

సహ చట్టం దరఖాస్తుకు డీజీపీ కార్యాలయ సమాధానం

ఈనాడు, అమరావతి: పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ను తామెప్పుడూ కొనలేదని ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ కార్యాలయం స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన కోనేరు నాగేంద్రప్రసాద్‌ అనే వ్యక్తి గతేడాది జులై 25న సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నలకు ఆగస్టు 12న ఈ సమాధానమిచ్చింది. పెగాసస్‌ సాఫ్ట్‌వేర్‌ కొనుగోలుకు సంబంధించిన మంజూరు లేఖ, ప్రొసీడింగ్స్‌ ఉంటే ఇవ్వాలని, ఆ సాఫ్ట్‌వేర్‌ను అమర్చిన కార్యాలయం చిరునామా వివరాలు తెలియజేయాలని, ఏ అధికారి ఆధ్వర్యంలో దాన్ని నిర్వహిస్తున్నారో ఆ వివరాలు ఇవ్వాలని కోరుతూ నాగేంద్రప్రసాద్‌ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. తమ కార్యాలయం ఎప్పుడూ పెగాసస్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌ను కొనలేదని డీజీపీ కార్యాలయ పరిపాలన విభాగం డీఐజీ దానికి సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని