Andhra News: చెవులు లేకుండా శిశువు జననం

రెండు చెవులూ లేకుండా ఓ మగబిడ్డ జన్మించాడు. విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలు.

Updated : 20 Mar 2022 09:42 IST

పాడేరు, న్యూస్‌టుడే: రెండు చెవులూ లేకుండా ఓ మగబిడ్డ జన్మించాడు. విశాఖ జిల్లా పెదబయలు మండలం వనబంగి గ్రామానికి చెందిన మోహన్‌రావు, నాగమణి భార్యాభర్తలు. ఈ నెల 18వ తేదీన నాగమణి పాడేరు జిల్లా ఆసుపత్రి ప్రసూతి విభాగంలో చేరారు. అదే రోజు సాయంత్రం ఆమె ప్రసవించారు. చెవులు లేకుండా జన్మించిన శిశువును చూసి తల్లిదండ్రులు భోరున విలపించారు. ఈ బిడ్డ వీరికి రెండో సంతానం. శిశువు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మెరుగైన పరీక్షలు, చికిత్స నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శంకరప్రసాద్‌ మాట్లాడుతూ ఇలాంటి జననాలు చాలా అరుదుగా జరుగుతాయన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని