Buggana: 3 రాజధానుల ఏర్పాటే మా ప్రభుత్వ ఆకాంక్ష: బుగ్గన

రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమ్మిళిత, సంతులిత వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలిలో తెలిపారు. పౌరుల దగ్గరకు పాలనను తీసుకువెళ్లి, సగటు మనిషిని ప్రధాన

Updated : 22 Mar 2022 08:27 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సమ్మిళిత, సంతులిత వృద్ధికి మూడు రాజధానులు ఉండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోందని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసన మండలిలో తెలిపారు. పౌరుల దగ్గరకు పాలనను తీసుకువెళ్లి, సగటు మనిషిని ప్రధాన అభివృద్ధి స్రవంతిలోకి తేవాలనే ఉద్దేశంతోనే రాష్ట్రం వికేంద్రీకరణ విధానాన్ని అవలంబిస్తోందని చెప్పారు.

ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, దువ్వాడ శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు సోమవారం ఆయన సమాధానం ఇచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న పథకాలకు రాష్ట్ర వాటా నిధులు ఇవ్వకపోవడంవల్ల ఆ పథకాల అమలు దెబ్బతిన్నదనే మాట వాస్తవం కాదని మంత్రి బుగ్గన వెల్లడించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏపీలో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.13,631.82 కోట్లతో పథకాలు అమలు చేసినట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర వాటా రూ.9,243.48 కోట్లు కాగా, రాష్ట్ర వాటా నిధులు రూ.4,388.34 కోట్లుగా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని