Lifespan: దేశంలో పెరిగిన సగటు జీవితకాలం..

దేశంలో మానవుల సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా.. 2020నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది.

Updated : 06 Apr 2022 08:11 IST

47.7 నుంచి 69.6 ఏళ్లకు
‘పసిఫిక్‌ అబ్జర్వేటరీ ఆన్‌ హెల్త్‌సిస్టమ్స్‌ అండ్‌ పాలసీస్‌’ నివేదిక వెల్లడి

ఈనాడు-అమరావతి: దేశంలో మానవుల సగటు జీవితకాలం పెరిగింది. 1970లో 47.7 ఏళ్లు ఉండగా.. 2020నాటికి ఇది 69.6 ఏళ్లకు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ విషయంలో విశేష పురోగతి కనిపిస్తోంది. జీవితకాలం పెరిగిన రాష్ట్రాల జాబితాలో తొలుత ఉత్తరప్రదేశ్‌.. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, బిహార్‌, అస్సాం, ఏపీ వరుస స్థానాల్లో ఉన్నాయి. ఏషియా పసిఫిక్‌ అబ్జర్వేటరీ ఆన్‌హెల్త్‌ సిస్టమ్స్‌ అండ్‌ పాలసీస్‌ విడుదల చేసిన ‘భారత్‌లో ఆరోగ్య రంగం-సమీక్ష’ నివేదిక దీన్ని వెల్లడించింది. 1970నుంచి ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ఆయా శాఖల నివేదికను ‘డబ్ల్యూహెచ్‌వో’ తాజాగా విడుదల చేసింది. పబ్లిక్‌హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌, సెంటర్‌ఫర్‌ జెండర్‌ ఈక్వాలిటీ అండ్‌ హెల్త్‌, జిందాల్‌ విశ్వవిద్యాలయం, మెడికల్‌ ఫ్యాకల్టీ అండ్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ (జర్మనీ) నిపుణులు ఈ నివేదిక రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు. నివేదికలో 2005నాటికి, 2019నాటికి మరణాలకు దారితీసే కారణాల్లో మొదటి నాలుగు అలాగే ఉన్నాయి. గుండెపోటు, సీవోపీడీ, పక్షవాతం, విరేచనాలతో మరణించేవారు ఎక్కువగా ఉన్నారు. 2005లో లేని జబ్బులు కొన్ని 2019నాటికి అదనంగా చేరాయి. కాలేయం, మధుమేహ సంబంధిత వ్యాధులు ఇందులో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని