Andhra News: సింహాచలం ఆలయానికి కొత్త పాలకవర్గం.. ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు కొనసాగింపు

విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి రెండేళ్ల కాలపరిమితితో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూ, మరో 14

Updated : 07 Apr 2022 08:09 IST

ఈనాడు, అమరావతి: విశాఖ జిల్లా సింహాచలం ఆలయానికి రెండేళ్ల కాలపరిమితితో పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. వంశపారంపర్య ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజును ఛైర్మన్‌గా కొనసాగిస్తూ, మరో 14 మందిని సభ్యులుగా నియమించింది. సువ్వాడ శ్రీదేవి, పంచాడి పద్మ, వంకాయల సాయినిర్మల, దశమంతుల రామలక్ష్మి, ఎం.రాజేశ్వరి, శ్రీదేవివర్మ పెన్మత్స, బయ్యవరపు రాధ, సంపంగి శ్రీనివాసరావు, పిల్లా కృష్ణమూర్తిపాత్రుడు, దొడ్డి రమణ, గంట్ల శ్రీనుబాబు, ఆర్‌.వీరవెంకటసతీష్‌, వారణాసి దినేశ్‌రాజ్‌, కె.నాగేశ్వరరావులకు సభ్యులుగా స్థానం కల్పించింది. దొడ్డి రమణ గాజువాక ప్రాంతంలో వైకాపా తరఫున కార్పొరేటర్‌గా పోటీచేసి ఓడిపోయారు. దినేశ్‌రాజ్‌ మార్చితో ముగిసిన గత పాలకవర్గంలోనూ సభ్యుడిగా ఉన్నారు.

గతంలో సంచైత నియామకంతో వివాదం: రెండేళ్ల కిందట 2020 మార్చి 3న రాత్రివేళ సింహాచల ఆలయ ఛైర్‌పర్సన్‌గా ఆనందగజపతిరాజు కుమార్తె సంచైత గజపతిరాజుతో పాటు, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులివ్వడంతో పెద్ద దుమారమే రేగింది. తెల్లవారగానే సంచైత బాధ్యతలు చేపట్టారు. దీనిపై అశోక్‌గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించడంతో.. ఆమె నియామకాన్ని రద్దుచేసి, అశోక్‌ను కొనసాగిస్తూ తీర్పు వెలువడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని