టెలి సేవలకు ఏపీకి తొలి ర్యాంకు

రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలవుతోన్న రెండు పథకాలకు కేంద్రం నుంచి గుర్తింపు లభించింది. టెలి కన్సల్టేషన్‌ ద్వారా వైద్య సేవలందించడంలో ముందున్నందున వైద్య ఆరోగ్య

Published : 17 Apr 2022 05:22 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా అమలవుతోన్న రెండు పథకాలకు కేంద్రం నుంచి గుర్తింపు లభించింది. టెలి కన్సల్టేషన్‌ ద్వారా వైద్య సేవలందించడంలో ముందున్నందున వైద్య ఆరోగ్య శాఖకు జాతీయ స్థాయిలో తొలి ర్యాంకు లభించినట్లు శనివారం అధికారులు తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 1,30,000 మందికి దేశ వ్యాప్తంగా టెలి కన్సల్టేషన్‌ ద్వారా సేవలందుతున్నాయి. ఇందులో రాష్ట్రంలో 60-70 వేల మందికి 27 హబ్స్‌ల్లో ఉన్న వైద్యుల నుంచి టెలి కన్సల్టేషన్‌ ద్వారా సలహాలు, సూచనలు అందుతున్నాయి. రెండో స్థానంలో కర్ణాటక, మూడో స్థానంలో మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అలాగే..ఆయుష్మాన్‌ భారత్‌ కింద హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ కేంద్రాల నిర్వహణ కింద రాష్ట్రానికి ప్రశంసాపత్రం లభించింది. ఆజాది కా అమృత్‌ మహోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రాల ప్రగతిని గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని