వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మళ్లీ ప్రారంభం

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను విచారణకు హాజరుకావాలని

Published : 20 Apr 2022 04:50 IST

ఈనాడు డిజిటల్‌, కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ మళ్లీ తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌యాదవ్‌ సోదరుడు కిరణ్‌కుమార్‌ యాదవ్‌ను విచారణకు హాజరుకావాలని నోటీసు ఇచ్చింది. మంగళవారం సీబీఐ ముందు ఆయన హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో పులివెందులకు మంగళవారం దర్యాప్తు సంస్థ అధికారులు చేరుకున్నారు. మరోమారు నోటీసు ఇచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. గతంలోనూ సీబీఐ ఇతడిని విచారించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని