Andhra News: వైద్యులు లాంగ్‌ లీవ్‌ పెడితే కొలువుకు సెలవే

బోధనాసుపత్రుల్లో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే విధుల నుంచి తొలగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఇతర అధికారులతో

Updated : 21 Apr 2022 12:23 IST

వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: బోధనాసుపత్రుల్లో వైద్యులు దీర్ఘకాలిక సెలవులో వెళ్తే విధుల నుంచి తొలగిస్తామని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు. గుంటూరు సర్వజనాసుపత్రిలో బుధవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ఇతర అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూరాలజీ విభాగం అధిపతి ఆచార్య ప్రకాశరావు మాట్లాడుతూ తమ విభాగంలో ఉన్న ఇద్దరు సహాయ ఆచార్యులు ఇటీవల విశాఖపట్నం బదిలీ అయ్యారని, అక్కడి నుంచి వచ్చిన ఇద్దరు వైద్యులు విధుల్లో చేరి.. వెంటనే సెలవుపై వెళ్లిపోయారని తెలిపారు. దీనివల్ల తాను ఒక్కడినే రోగులకు సేవలందించడం కష్టంగా మారిందని చెప్పగా కృష్ణబాబు ఈ విధంగా స్పందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని