Andhra News: ఉద్యోగులకు ఉచిత వసతి మరో రెండు నెలలు పొడిగింపు

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ సాధారణ పరిపాలన

Updated : 01 May 2022 06:56 IST

ఈనాడు, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్‌ నుంచి వచ్చి అమరావతిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కల్పించిన ఉచిత వసతి సదుపాయాన్ని మరో రెండు నెలలు పొడిగిస్తూ సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్‌ శనివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఏపీ సచివాలయం, శాసనసభ, విభాగాధిపతుల కార్యాలయాలు, హైకోర్టు, రాజ్‌భవన్‌ ఉద్యోగులకు మే 1 నుంచి జూన్‌ 30 వరకు ఈ సదుపాయం వర్తిస్తుందని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు