Andhra News: ఫోన్‌ మోగాలన్నా.. జనరేటర్‌ నడవాల్సిందే!

విద్యుత్తు విరామం వల్ల సెల్‌ఫోన్‌ టవర్లనూ జనరేటర్లతో నడపాల్సి వస్తోంది. సాధారణంగా కరెంటు పోయినా టవర్లు పనిచేసేలా వాటికి బ్యాటరీలు ఉంటాయి. ఇవి 3 గంటల్లో ఛార్జింగ్‌ అయితే.. విద్యుత్తు

Published : 09 May 2022 08:41 IST

విద్యుత్తు విరామం వల్ల సెల్‌ఫోన్‌ టవర్లనూ జనరేటర్లతో నడపాల్సి వస్తోంది. సాధారణంగా కరెంటు పోయినా టవర్లు పనిచేసేలా వాటికి బ్యాటరీలు ఉంటాయి. ఇవి 3 గంటల్లో ఛార్జింగ్‌ అయితే.. విద్యుత్తు లేనప్పుడు 2 గంటలు యంత్రాలను నడిపిస్తాయి. కానీ.. పవర్‌హాలీడే వల్ల పూర్తిగా రెండు రోజులు విద్యుత్తు ఉండటం లేదు. దీంతో బ్యాటరీలు ఛార్జింగ్‌ కోల్పోతున్నాయి. ప్రకాశం జిల్లాలో గురు, శుక్రవారాలు విద్యుత్తు విరామం ప్రకటించడంతో ఆ రోజుల్లో వాటిని రీఛార్జి చేసేందుకు జనరేటర్లు తప్పనిసరైంది. ఈ 2 రోజులు ఒక టవర్‌ బ్యాటరీలు రీఛార్జి చేసేందుకు 100 లీటర్ల డీజిల్‌ ఖర్చవుతోందని నిర్వాహకులు తెలిపారు. ప్రకాశం జిల్లా పొదిలి మండలం తలమళ్ల గ్రామంలో వ్యాన్‌లో జనరేటర్‌ తెచ్చి ఛార్జింగ్‌ పెడుతుండటాన్ని చిత్రంలో చూడొచ్చు.

-ఈనాడు, ఒంగోలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని