Andhra News: ఒప్పంద అధ్యాపకులకు 2 నెలల జీతం కోత

ఒప్పంద అధ్యాపకులకు 2 నెలల జీతం కోత విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు పది రోజుల విరామంతో 12 నెలలకు ఇస్తున్న వేతనాన్ని 10 నెలలకే పరిమితం చేయనుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో

Published : 10 May 2022 08:53 IST

ఈనాడు, అమరావతి: ఒప్పంద అధ్యాపకులకు 2 నెలల జీతం కోత విధించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటి వరకు పది రోజుల విరామంతో 12 నెలలకు ఇస్తున్న వేతనాన్ని 10 నెలలకే పరిమితం చేయనుంది. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకుల సేవల పొడిగింపునకు కమిషనరేట్‌ పంపిన ప్రతిపాదనల్లో 10 నెలలకే ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం. లెక్చరర్ల ఒప్పంద గడువు మార్చి 20తో పూర్తయింది. దీంతో ఏప్రిల్‌ నుంచి రెన్యువల్‌ కోసం ఇంటర్మీడియట్‌ కమిషనర్‌ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా.. ఆర్థికశాఖ 10 రోజుల విరామంతో 10 నెలలు ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. ఆర్థికశాఖ నుంచి ప్రస్తుతం ఈ దస్త్రం పాఠశాల విద్యాశాఖ వద్దకు చేరింది. దీనిపై త్వరలో ఉత్తర్వులు జారీ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,618మంది ఒప్పంద జూనియర్‌ లెక్చరర్లు పని చేస్తున్నారు. వీరందరూ రెండు నెలల జీతాన్ని కోల్పోవాల్సి వస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని