Andhra News: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌లో నక్కిన చిరుత

నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద చిరుత సంచారం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నల్లమల్ల అడవికి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కి మధ్య కృష్ణానది ఉంది.

Updated : 10 May 2022 08:30 IST

నందికొట్కూరు, న్యూస్‌టుడే: నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ వద్ద చిరుత సంచారం ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. నల్లమల్ల అడవికి, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కి మధ్య కృష్ణానది ఉంది. అడవి నుంచి నీటి కోసం వచ్చిన చిరుత పోతిరెడ్డిపాడు సమీపంలోని రాయలసీమ ఎత్తిపోతల పథకం వద్దకు చేరుకుంది. సోమవారం నిర్మాణంలో ఉన్న భవనం పిల్లర్ల వద్ద పడుకుని ఉండగా కూలీలు గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది, రెస్క్యూ బృందం, వైద్యులు అక్కడికి చేరుకున్నారు. చిరుతను పట్టుకుని అడవిలో వదిలేందుకు ప్రయత్నించారు. మొదట దాక్కున్న పిల్లరు నుంచి మరో పిల్లరు వద్దకెళ్లి గేటు చాటున నక్కిన చిరుత అక్కడి నుంచి ఎంతకూ కదల్లేదు. రాత్రి వరకు అధికారులు అక్కడే వేచి ఉన్నారు. సమీప గ్రామాల ప్రజలెవరూ రాత్రివేళ ఇంటి నుంచి బయటికి రావద్దని పోలీసులు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని