Andhra News: దాచడంలో కన్నా ఆయనకు దానంలోనే తృప్తి!

చేతిలో డబ్బుంటే చాలామంది రేపటి కోసం దాచుకుంటారు. ఏలూరుకు చెందిన తమ్మినేని నాగరాజు మాత్రం దాంతో ఎంత ఎక్కువ మంది ఆకలి తీర్చగలను అని ఆలోచిస్తారు.

Updated : 16 May 2022 07:29 IST

ఈనాడు, ఏలూరు : చేతిలో డబ్బుంటే చాలామంది రేపటి కోసం దాచుకుంటారు. ఏలూరుకు చెందిన తమ్మినేని నాగరాజు మాత్రం దాంతో ఎంత ఎక్కువ మంది ఆకలి తీర్చగలను అని ఆలోచిస్తారు. పశుపక్ష్యాదుల కడుపూ నింపుతారు. నాగరాజుది అసలు ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం సాగిపాడు గ్రామం. గ్రామంలో వ్యవసాయం చేయిస్తూనే.. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉంటూ అక్కడి ఆసుపత్రులు, కూడళ్లల్లో అవసరమైన వారికి పండ్లు, రొట్టెలు పంచిపెడుతున్నారు. కాయగూరలు కొనుగోలు చేసి సమీపంలోని గోశాలలకు వెళ్లి వాటిని మూగజీవాలకు వేస్తున్నారు. పంచుకుంటూ పోతే చివరకు ఏమీ మిగలదు కదా అని ఎవరైనా ఆయన్ని పలకరిస్తే.. ‘నాకున్న 30 ఎకరాల భూమిలో 25 ఎకరాలు కుమారుల పేరిట రాశా. దానధర్మాల కోసం ఐదెకరాల పొలం విక్రయించా. 8ఏళ్లుగా సేవ చేస్తున్నా. ఇందుకు నెలకు సుమారు రూ.లక్ష ఖర్చవుతోంది. డబ్బును దాచడం కంటే దాంతో ఇతరుల ఆకలి తీర్చడంలోనే ఎంతో సంతృప్తి ఉంది’ అని అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని