Andhra News: కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది!: మంత్రి సురేష్‌

వైకాపా ప్రణాళికలో కర్నూలు అతి ముఖ్యమైన స్థానంలో ఉంది. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది. నేను చెప్పకనే చెబుతున్నా. ఆగస్టు తరువాత ఏం జరగబోతుందో. నేను అధికారికంగా చెప్పలేను

Updated : 17 May 2022 06:59 IST

ఆగస్టు తర్వాత ఏం జరగనుందో అధికారికంగా చెప్పలేకపోతున్నా

ఈనాడు, కర్నూలు: ‘వైకాపా ప్రణాళికలో కర్నూలు అతి ముఖ్యమైన స్థానంలో ఉంది. కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేసింది. నేను చెప్పకనే చెబుతున్నా. ఆగస్టు తరువాత ఏం జరగబోతుందో. నేను అధికారికంగా చెప్పలేను.. కానీ కచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది’ అని పురపాలకశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వ్యాఖ్యానించారు. కర్నూలులో రూ.9 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు 2, 6 వార్డుల్లో పట్టణ ఆరోగ్య కేంద్రాలను సోమవారం ఆయన ప్రారంభించారు. అనంతరం నూతన కౌన్సిల్‌ హాల్‌లో జరిగిన కార్పొరేటర్ల సమావేశంలో మాట్లాడారు. ఆగస్టు తరువాత కర్నూలుకు మంచి రోజులు రానున్నాయన్నారు. విమానాశ్రయం, సెజ్‌లు, మంచి లేఅవుట్లు కర్నూలుకు వస్తాయని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న సుమారు 16వేల లేఅవుట్లను క్రమబద్ధీకరించనున్నామని (రెగ్యులరైజ్‌), విధి విధానాలను త్వరలో చెబుతామని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రాధాన్యమిస్తూ ఓహెచ్‌ఏ (ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్స్‌) కింద ప్రభుత్వం రూ.6వేలు కచ్చితంగా ఇవ్వాల్సి ఉందని.. ఇందుకు సంబంధించిన దస్త్రాన్ని పరిష్కరించి రూ.70 కోట్ల బకాయిలను చెల్లిస్తామని చెప్పారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని