Ponguru Narayana: నారాయణను కోర్టులో హాజరుపరచండి

మాజీ మంత్రి నారాయణను కోర్టులో హాజరుపరిచి.. ఆయన ఎదుటే జామీనుదారులను చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు. పదోతరగతి ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీసు కేసులో చిత్తూరు పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టుచేసి

Published : 17 May 2022 08:10 IST

ఆయన ఎదుటే జామీనుదారులను చూపండి
బెయిలు కేసులో న్యాయమూర్తి ఆదేశాలు
అభ్యంతరం తెలిపిన న్యాయవాదులు..విచారణ నేటికి వాయిదా

చిత్తూరు (న్యాయవిభాగం), న్యూస్‌టుడే: మాజీ మంత్రి నారాయణను కోర్టులో హాజరుపరిచి.. ఆయన ఎదుటే జామీనుదారులను చూపాలని న్యాయమూర్తి ఆదేశించారు. పదోతరగతి ప్రశ్నపత్రం మాల్‌ప్రాక్టీసు కేసులో చిత్తూరు పోలీసులు నారాయణను హైదరాబాద్‌లో అరెస్టుచేసి, ఈనెల పదో తేదీ అర్ధరాత్రి న్యాయమూర్తి సులోచనారాణి ఎదుట హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఆయనకు రూ.లక్ష సొంత పూచీకత్తుపై బెయిలు మంజూరుచేసి, రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తును ఈ నెల 18లోగా కోర్టుకు సమర్పించాలని అప్పట్లో ఆదేశించారు. దీంతో నారాయణ తరఫు న్యాయవాదులు చంద్రశేఖర్‌నాయుడు, రామకృష్ణ, జ్యోతిరామ్‌.. సోమవారం ఇద్దరు జామీనుదారులను స్థానిక నాలుగో అదనపు మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. అయితే.. నారాయణను కూడా కోర్టులో హాజరుపరచాలని, ఆయన ఎదుటే జామీనుదారులను చూపించాలని న్యాయమూర్తి శ్రీనివాస్‌ చెప్పగా, దానికి న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమ వాదనలు వినిపించారు. దీంతో కేసు విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని