దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ ఏర్పాటు

నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ కీలక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు

Updated : 20 May 2022 06:16 IST

నేడు బయలుదేరనున్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: నాలుగో పారిశ్రామిక విప్లవం దిశగా చేపట్టాల్సిన చర్యలపై దావోస్‌ వేదికగా ముఖ్యమంత్రి జగన్‌ కీలక చర్చలు జరుపుతారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఈనెల 22 నుంచి 26 వరకు దావోస్‌లో జరగనున్న వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరంలో పాల్గొనేందుకు సీఎం జగన్‌తోపాటు మంత్రులు, అధికారుల బృందం శుక్రవారం బయలుదేరనుంది. ‘రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాలు, పరిశ్రమల ఏర్పాటుకున్న అనువైన వాతావరణంవంటి అంశాలను వివరించేలా దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ఏర్పాటుచేశాం. ప్రజలు, పురోగతి, అవకాశాలు (పీపుల్స్‌, ప్రోగ్రెస్‌, పాజిబిలిటీ) నినాదంతో పెవిలియన్‌ను నిర్వహిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా హాజరయ్యే ప్రతినిధులతో కూడిన దావోస్‌ కాంగ్రెస్‌ పలు కీలకాంశాలపై దృష్టి పెట్టనుంది. ఆహారం, వాతావరణ మార్పులు, సాంకేతిక రంగాల్లో వినూత్న ఆవిష్కరణలు, సుపరిపాలన, సైబర్‌ సెక్యూరిటీ, అంతర్జాతీయ సహకారం, పునర్నిర్మాణం, ఆర్థిక వ్యవస్థలో సమతుల్యత, అందరికీ ఆరోగ్యంపై జరిగే చర్చలో ఏపీ భాగస్వామ్యం ఉంటుంది. కొవిడ్‌ పరిస్థితులు ఎదుర్కొని వివిధ రంగాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించేలా సన్నద్ధమయ్యాం’ అని ప్రభుత్వం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని