
AP News: ఓ బిడ్డకు జన్మనిచ్చి.. మరో బిడ్డ పుట్టేలోగా గర్భిణి మృతి
రంపచోడవరం, న్యూస్‌టుడే: తన కడుపున కవలలు పుడతారని తెలిసి.. ఆమె మురిసిపోయింది. నవమాసాలు గడిచి పురిటినొప్పులు మొదలయ్యాయి. ఓ బిడ్డకు జన్మనిచ్చిన ఆ తల్లి.. మరో బిడ్డను ఈ భూమ్మీదకు తీసుకురాకుండానే కన్నుమూసింది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఈ ఘటనపై మృతురాలి కుటుంబసభ్యుల కథనం.. మారేడుమిల్లి మండలం దేవరపల్లికి చెందిన గిరిజన మహిళ కోండ్ల సరస్వతికి ఆదివారం రాత్రి పురిటినొప్పులు రాగా ఇంటివద్దే కాన్పునకు సిద్ధమయ్యారు. అక్కడే ఒక బిడ్డకు జన్మనిచ్చింది. రెండో బిడ్డ ప్రసవానికి ఇబ్బందులు ఎదురవడంతో మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి పంపించారు. మళ్లీ పరిస్థితి విషమంగా ఉందని రాజమహేంద్రవరం జనరల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కడుపులో బిడ్డతో సహా సరస్వతి చనిపోయింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని బంధువులు ఆరోపించారు. ఆసుపత్రి గైనకాలజిస్టు డాక్టర్ ప్రమీలను వివరణ కోరగా ఆమె ఆరోగ్యం పూర్తిగా విషమించిన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారని, రక్తహీనత సమస్యతోనూ బాధపడుతోందని చెప్పారు. ఇంటిదగ్గర పుట్టిన బిడ్డ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Ts-top-news News
CM KCR: సీఎం ఇలాకాలో కలికితురాయి.. గజ్వేల్‌కు గూడ్స్ బండి
-
Related-stories News
Facebook: ఫేస్బుక్ మెసెంజర్ సహాయంతో కుటుంబం చెంతకు బెంగాల్ బాలుడు
-
Ap-top-news News
Andhra News: ఏపీలో జులై 5 నుంచి బడులు
-
Related-stories News
Telangana News: సరెండర్‌లీవ్ డబ్బు కోసం ఎదురుచూపులు
-
Ts-top-news News
Telangana News: నన్ను చదివించండి సారూ!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- IND vs IRL: కూనపై అలవోకగా..
- Weddings: వివాహాల్లో భారీ అలంకరణలు, డీజే సౌండ్లు బంద్.. వరుడు క్లీన్ షేవ్ చేసుకోవాల్సిందే..
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- Madhavan: పంచాంగం పేరు చెప్పటం నిజంగా నా అజ్ఞానమే.. కానీ: మాధవన్
- చెరువు చేనైంది
- Agnipath: అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ.. మూడు రోజుల్లోనే ఎన్ని వచ్చాయంటే..?
- లీజుకు క్వార్టర్లు!
- Road Accident: నుజ్జయిన కారులో గర్భిణి నరకయాతన
- చందునా.. మజాకా!
- Chiranjeevi: నాకూ గోపీచంద్‌కు ఉన్న సంబంధం అదే: చిరంజీవి