
Azadi Ka Amrit Mahotsav: సుభాష్ అను నేను..
భారత తొలి ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రమాణం చేయటానికి నాలుగేళ్ల ముందే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆ పని చేశారు. 1943లో సరిగ్గా ఇదే రోజు (అక్టోబరు 21) నేతాజీ సారథ్యంలో సింగపూర్ వేదికగా భారత తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. వారి చేతిలో ఉన్న భారత భూభాగం... అండమాన్ నికోబార్ దీవి మాత్రమే!
రెండో ప్రపంచయుద్ధం చివరి రోజులనాటికి భారత్ స్వాతంత్య్ర సమరం నాటకీయంగా మారసాగింది. జర్మనీ, జపాన్, బ్రిటన్‌ల మధ్య పోరు ప్రభావం భారత్‌పై పడుతున్న దశ అది. భారత్‌లో బ్రిటిష్‌వారి చెర నుంచి తప్పించుకుని వెళ్లిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్, జర్మనీల సహకారంతో సాయుధ మార్గంలో భారత్‌ను విముక్తం చేయాలని భావించారు. ఆ క్రమంలో ఆజాద్ హింద్ ఫౌజ్ (ఐఎన్‌ఏ)ను ఏర్పాటు చేశారు. బర్మా, సింగపూర్‌లాంటి చోట్ల ఓడిపోయి జపాన్ చేతికి చిక్కిన బ్రిటన్ సైన్యంలోని భారతీయ సిపాయిలు బోస్ సైన్యంలో చేరారు. వీరికి జపాన్, బర్మా, మలేసియా తదితర దేశాల్లోని భారతీయులు కూడా తోడయ్యారు. బలూచిస్థాన్ నుంచి మొదలెట్టి... దక్షిణభారతం దాకా అన్ని ప్రాంతాలవారితో సుమారు 50వేల మందితో ఐఎన్‌ఏ ఓ భారత సమాహారంగా రూపుదిద్దుకుంది. ఝాన్సీ పేరిట ఏర్పాటైన రెజిమెంట్‌లో భారీసంఖ్యలో మహిళలు కూడా చేరటం విశేషం.
సింగపూర్‌ను జపాన్ గెల్చుకోవటంతో బోస్ కార్యకలాపాలకు ఆ దేశం వేదికైంది. జపాన్ ప్రభుత్వ మద్దతుతో 1943 అక్టోబరు 21న నేతాజీ సింగపూర్ కాథీ థియేటర్‌లో ఆర్జి హుకూమత్ ఎ ఆజాద్ హింద్ (స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వం)ను ఏర్పాటు చేశారు. బోస్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయగా... లెఫ్టినెంట్ కర్నల్ ఏసీ ఛటర్జీ ఆర్థికమంత్రిగా, లక్ష్మీస్వామినాథన్ మహిళా వ్యవహారాల మంత్రిగా ప్రమాణం చేశారు. గాంధీజీ చర్ఖా గల త్రివర్ణ పతాకాన్ని తమ పతాకంగా ప్రకటించారు. సబ్ సుఖ్ చయన్ (జనగణమనకు ఉర్దూ అనువాదం) జాతీయగీతంగా, జైహింద్‌ను నినాదంగా నిర్ణయించారు. తొలితరం విప్లవవాది రాస్ బిహారీ బోస్ ప్రభుత్వానికి సలహాదారుగా నియమితులయ్యారు. భారత్‌ను బ్రిటన్ నుంచి విముక్తం చేయటానికి విదేశీగడ్డపై ఏర్పడ్డ తాత్కాలిక ప్రభుత్వమిది. అండమాన్ నికోబార్ దీవులపై తప్పిస్తే భారత్‌లోని ఏ ప్రాంతంపైనా దీనికి అధికారం లేదు. అండమాన్ నికోబార్‌ను బ్రిటన్ నుంచి జపాన్ గెల్చుకొని... నేతాజీకి అప్పగించింది. పేరుకు నేతాజీ ప్రభుత్వమే అయినా పెత్తనమంతా
జపాన్ సైన్యాలదే!
ప్రభుత్వ ఏర్పాటు తరువాత నేతాజీ.. చలో దిల్లీ అంటూ పిలుపునిచ్చారు. భారత్‌లోని బ్రిటన్ ప్రభుత్వంపై ఇండో-బర్మా సరిహద్దుల్లో యుద్ధం ప్రకటించారు. ఇంఫాల్-కోహిమా సెక్టార్‌లో కూడా జపాన్ సేనలతో కలసి ఐఎన్‌ఏ పోరాడింది. కొన్ని విజయాలు... కొన్ని వెనకడుగులతో సాగిన ఐఎన్‌ఏ యాత్ర తన లక్ష్యాన్ని నేరుగా సాధించకున్నా... పరోక్షంగా బ్రిటన్ ప్రభుత్వ గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. తమపక్షాన పోరాడుతున్న భారత సైనికులను నమ్మలేని పరిస్థితి కల్పించింది. ఎక్కడ తిరుగుబాటు తలెత్తుతుందోననే ఆందోళన వారిలో రోజురోజుకూ ఎక్కువైంది. భారత్‌ను ఇక ఎక్కువరోజు పాలించలేమనే భావన బ్రిటన్ మదిలో బలంగా నాటడంలో ఐఎన్‌ఏ సఫలమైంది.
కష్టాల్లో, సుఖాల్లో; చీకటిలో వెలుతురులో; గెలుపులో ఓటమిలో... మీ వెంటుంటా! ప్రస్తుతానికి నేను మీకేమీ ఇవ్వలేకున్నా... నాతో పాటు కలిసి నడిస్తే... తప్పకుండా స్వేచ్ఛనిస్తా! తాత్కాలికమే అయినా... ఇది ప్రతి ఒక్క భారతీయుడి ప్రభుత్వం. ప్రజలందరికీ సమానమైన హక్కులు, అవకాశాలతో పాటు మతపరమైన స్వేచ్ఛకు ఈ ప్రభుత్వం పూర్తి గ్యారెంటీ ఇస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం పాటించిన కుళ్లు, కుతంత్రాల విభజిత పాలన కాకుండా ప్రజలందరి సుఖసంతోషాలు, శ్రేయస్సు కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది’’
- సుభాష్ చంద్రబోస్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
Archana Shastry: అందుకే ‘మగధీర’లో నటించలేదు.. అర్చన కన్నీటి పర్యంతం
-
General News
cm jagan: ఆరోగ్యశ్రీని మరింత బలోపేతం చేయాలి: సీఎం జగన్
-
Latestnews News
TS Inter Results 2022: మీ మార్కుల మెమో డౌన్లోడ్ చేసుకున్నారా?
-
India News
Mumbai: ముంబయిలో భవనం కుప్పకూలి 14మంది మృతి!
-
General News
CM KCR: హైదరాబాద్‌లో మరో కీలక ఘట్టం... టీహబ్ 2.0 ప్రారంభించిన సీఎం కేసీఆర్
-
India News
Sanjay raut: సంజయ్ రౌత్‌కు ఈడీ మళ్లీ సమన్లు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు
- ఫలించిన ఎనిమిదేళ్ల తల్లి నిరీక్షణ: ‘ఈటీవీ’లో శ్రీదేవి డ్రామా కంపెనీ చూసి.. కుమార్తెను గుర్తించి..
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (28/06/2022)
- నాకు మంచి భార్య కావాలి!
- Usa: అమెరికాలో వలస విషాదం : ఒకే ట్రక్కులో 40కి పైగా మృతదేహాలు..!
- Mohan Babu: తిరుపతి కోర్టుకు నటుడు మోహన్‌బాబు
- ఆవిష్కరణలకు అందలం
- upcoming movies: ఈ వారం థియేటర్/ ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
- Nambi Narayanan: దేశం కోసం శ్రమిస్తే దేశ ద్రోహిగా ముద్రవేశారు.. నంబి నారాయణన్ కథ ఇదీ!
- Pallonji Mistry: వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత