
Kodali Geethika: విజయగీతిక
14 ఏళ్లకే అమెరికా మహిళా క్రికెట్ జట్టులోకి
17 ఏళ్లకే అండర్-19 జట్టుకు సారథ్యం
తెలుగు యువ కెరటం గీతిక కొడాలి
ఈనాడు, అమరావతి: ఆశయం.. అందుకు తగ్గ శ్రమ ఉంటే అవకాశాలకు హద్దులు ఉండవని ఓ తెలుగు యువ కెరటం నిరూపించింది. తక్కువ వయసులోనే అమెరికాలోని క్రికెట్ జట్టుకు సారథ్యం వహించే స్థాయికి ఎదిగింది. 11వ ఏట బ్యాట్ చేతపట్టి.. 14 ఏళ్లకే యూఎస్ మహిళా క్రికెట్ జట్టులో ఆడే అవకాశం దక్కించుకుంది. 17 ఏళ్లకు అండర్-19 జట్టుకు సారథ్యం వహిస్తోంది గీతిక కొడాలి. విజయవాడకు చెందిన కొడాలి ప్రశాంత్, మాధవిల కుమార్తె గీతిక.. అమెరికాలోని నార్త్‌కరోలినాలో 12వ తరగతి చదువుతూనే క్రికెట్లో సత్తా చాటుతోంది. కెప్టెన్‌గా తమ బృందాన్ని విజయపథంలో నడిపిస్తూ తొలి సిరీస్‌లోనే విజయాన్ని అందుకుంది. యూఎస్ ఉమెన్స్ జట్టు కెప్టెన్‌గా వరల్డ్ కప్‌లో ఆడటమే లక్ష్యం అంటున్న గీతిక ‘ఈనాడు-ఈటీవీ’కి చెప్పిన ముచ్చట్లు..
యూఎస్ మహిళా జట్టుకు ఎంపికై
చిన్నప్పటి నుంచి క్రీడలంటే ఎంతో ఇష్టం. కానీ క్రికెటే నా లోకం అవుతుందని ఎప్పుడూ ఊహించలేదు. బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నల సూచనతో కోచ్ రఘును కలిశాం. శిక్షణ తీసుకుంటే క్రికెట్లో బాగా రాణిస్తావని ఆయన చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత 14వ ఏట అమెరికన్ మహిళా జట్టులోకి వెళ్లే అవకాశం లభించింది. జట్టు ఎంపిక కోసం మూడు క్యాంప్‌లు జరిగాయి. 32 మంది హాజరయ్యారు. 14 ఏళ్ల విభాగంలో ఎంపికయ్యా. జట్టులో నేనే చిన్నదాన్ని. నేషనల్ ఉమెన్ క్రికెట్ లీగ్‌కు ఆడాను. సీనియర్ల నుంచి మెలకువలు నేర్చుకోవడంతోపాటు.. ఫిట్నెస్, బౌలింగ్ సామర్థ్యాలను మెరుగుపరుచుకున్నాను. కెనడా, మెక్సికో, జింబాబ్వే తదితర దేశాల్లో 20 మ్యాచ్‌లు ఆడాను.
అమ్మానాన్న సహకారంతోనే
అమ్మ మాధవి, నాన్న ప్రశాంత్ సహకారంతోనే క్రికెట్లో రాణిస్తున్నా. చిన్ననాటి నుంచి ఎంతో ప్రోత్సహించారు. నార్త్‌కరోలినా అయితే క్రికెట్‌కు మంచి సౌకర్యాలు ఉంటాయని.. నా కోసమే కాలిఫోర్నియా నుంచి నివాసం మార్చారు. ఇది నా చదువుకు కూడా దోహదపడింది. నా చిన్నతనంలో ఏటా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వాళ్లం. హైస్కూల్‌కు వచ్చాక సమ్మర్ ఇంటర్న్‌షిప్‌తో అవకాశం కుదరలేదు. ఈ లోగా కొవిడ్ రావడమూ కారణమైంది. త్వరలో ఇండియాకు వస్తాను. మన గడ్డపై కూడా క్రికెట్ ఆడతాను.
అండర్-19 జట్టు సారథిగా
అమెరికాలో తొలిసారిగా గతేడాది అండర్-19 జట్టును ఏర్పాటు చేశారు. జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించే అవకాశం మొదటగా నాకే లభించింది. మొత్తం 15 మందితో కూడిన మా జట్టు తొలి పర్యటనలో భాగంగా కరేబియన్ ఐలాండ్స్‌లో సెయింట్ విన్సెంట్‌లో ఆడాం. ఈ జట్టులో అత్యధికులు భారతీయ సంతతి వారే. సిరీస్‌లో భాగంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి.. మూడు గెలిచాం. బృంద సభ్యుల్లో విశ్వాసం నింపుతూ.. విజయం దిశగా అడుగేశాం. మే నెలలో దుబాయ్‌లో జరిగే ఫెయిర్‌బ్రేక్ టోర్నమెంట్‌కు మా బృందం సిద్ధమవుతోంది. మహిళా క్రికెట్‌ను యూఎస్ క్రికెట్ అసోసియేషన్‌తో పాటు ఐసీసీ ఛార్టర్ ఎంతో ప్రోత్సహిస్తున్నాయి. శాటిలైట్ కోచ్ సెషన్స్ ఏర్పాటు చేసి.. స్థానికంగా శిక్షణ ఇచ్చేవారు. అక్కడ సిద్ధమయ్యాక.. టీమ్ ప్రాక్టీసెస్, మ్యాచ్‌కు వారంముందు బృందం సభ్యులంతా కలిసి మళ్లీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వేసవిలో రీజినల్స్, నేషనల్ ఆడాం. క్రికెట్ నాకు సమయపాలన నేర్పింది. చదువు, ఆటను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లేలా ప్రణాళిక రూపొందించుకుంటున్నాను. తొమ్మిది, పదో గ్రేడ్ల వరకు స్కూల్లో రాణిస్తూనే క్రికెట్ ఆడేదాన్ని. 11, 12 గ్రేడ్లలో పాఠశాలకు వెళ్లలేని పరిస్థితుల్లో ఉపాధ్యాయులు సహకారం అందించారు. క్రికెట్‌తో నాలో టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ పెరిగాయి.
ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో పాల్గొనాలి
గీతిక చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడేది. కోచ్ రఘును కలవగా క్రికెట్లో బాగా రాణిస్తుందని చెప్పారు. రెండేళ్ల శిక్షణ తర్వాత యూఎస్ ట్రైఔట్స్కు వెళ్లి.. విజయవంతంగా ఎంపికైంది. ఇప్పుడు ఆల్‌రౌండర్‌గా అడుగేస్తోంది. అంతర్జాతీయ స్థాయి సిరీస్‌లో తొలి విజయం నమోదు చేయడం సంతోషించదగ్గ విషయం. ఇండియా ఉమెన్స్ ఐపీఎల్లో ఆమె పాల్గొనాలని కోరుకుంటున్నాం.
-తల్లిదండ్రులు కొడాలి ప్రశాంత్, మాధవి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్‌స్టేషన్‌లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
-
Politics News
Pawan Kalyan: జనసేన కౌలురైతు భరోసా నిధికి అంజనాదేవి సాయం.. పవన్‌కు చెక్కు అందజేత
-
India News
Teesta Setalvad: ప్రముఖ సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ అరెస్టు
-
General News
Top Ten news @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
General News
Telangana News: టీచర్ల ఆస్తులపై విద్యాశాఖ ఉత్తర్వులు రద్దు చేసిన ప్రభుత్వం
-
Crime News
Crime News: ఇద్దరిని మింగిసేసిన సెల్లార్ గుంత... మృతులు శ్రీకాకుళం జిల్లా వాసులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (25-06-2022)
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Google Play Store: ఫోన్లో ఈ ఐదు యాప్స్ ఉన్నాయా? వెంటనే డిలీట్ చేసుకోండి!
- Triglycerides: ట్రైగ్లిజరైడ్ కొవ్వులను కరిగించేదెలా అని చింతించొద్దు!
- Cinema news: హతవిధీ.. ‘బాలీవుడ్’కి ఏమైంది... ‘బారాణా’ సినిమాలు..‘చారాణా’ కలెక్షన్లు!
- నాతో పెళ్లి.. తనతో ప్రేమేంటి?
- Super Tax: పాక్‌లో ‘సూపర్’ పన్ను!
- Amit Shah: శివుడిలా మోదీ విషాన్ని దిగమింగుకున్నారు.. 19ఏళ్లు వేదన అనుభవించారు..!
- డబుల్ చిన్.. ఇలా తగ్గించుకుందాం!
- US: అబార్షన్ హక్కుపై అమెరికా సుప్రీం సంచలన తీర్పు