Dharmareddy: బాధ్యతలు అప్పగించక ముందే సామగ్రి తరలింపు.. ధర్మారెడ్డి తీరుపై విమర్శలు

తితిదే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మరొకరికి బాధ్యతలు అప్పగించక ముందే గుట్టుగా తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, సామగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది.

Updated : 17 Jun 2024 08:33 IST

ఈనాడు, తిరుపతి: తితిదే ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి మరొకరికి బాధ్యతలు అప్పగించక ముందే గుట్టుగా తన క్యాంపు కార్యాలయాన్ని ఖాళీ చేసేసి, సామగ్రిని తరలించడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నెల 11 నుంచి ధర్మారెడ్డికి ప్రభుత్వం సెలవు మంజూరు చేయగా.. ఆ రోజే తిరుమలలోని క్యాంపు కార్యాలయం నుంచి తనకు సంబంధించిన వస్తువులు, సామగ్రిని రెండు ట్రక్కుల్లో తరలించేశారు. సాధారణంగా మరో అధికారి బదిలీపై వచ్చాక బాధ్యతలు అప్పగించిన తర్వాత క్యాంపు కార్యాలయాలు ఖాళీ చేస్తుంటారు. ధర్మారెడ్డి ముందుగానే వాటిని ఎలా తీసుకెళ్తారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని