AP cabinet: నాడు ఎన్టీఆర్‌.. నేడు చంద్రబాబు క్యాబినెట్‌లలో ఆనం, ఫరూక్‌

నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో పనిచేసిన ఇద్దరు మంత్రులు.. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లోనూ మంత్రులుగా ప్రమాణం చేశారు.

Updated : 13 Jun 2024 06:59 IST

ఈనాడు, అమరావతి: నాలుగు దశాబ్దాల కిందట ఎన్టీఆర్‌ మంత్రివర్గంలో పనిచేసిన ఇద్దరు మంత్రులు.. ఇప్పుడు చంద్రబాబు క్యాబినెట్‌లోనూ మంత్రులుగా ప్రమాణం చేశారు. వారిలో ఒకరు ఎన్‌ఎండీ ఫరూక్‌ కాగా, మరొకరు ఆనం రామనారాయణరెడ్డి. 1978లో తొలుత మంత్రిగా ఎంపికైన చంద్రబాబునాయుడు అత్యంత సీనియర్‌ కాగా.. ఆయన తర్వాత ప్రస్తుత క్యాబినెట్‌లో సీనియర్లుగా ఫరూక్, ఆనం గుర్తింపు పొందారు. మొత్తంగా 24 మంది మంత్రుల్లో 17 మంది కొత్తవారు కాగా, ఏడుగురికి గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది.

 వారంతా ఒక్కోసారి..

  •  కింజరాపు అచ్చెన్నాయుడు 2014-19 మధ్య కార్మిక, రవాణాశాఖల మంత్రిగా పనిచేశారు. 
  •  పొంగూరు నారాయణ 2014-19లో పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా ఉన్నారు.
  •  కొల్లు రవీంద్ర 2014-19లో ఆబ్కారి, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా సేవలందించారు. 
  •  నారా లోకేశ్‌ 2017-19 మధ్య పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా వ్యవహరించారు. 
  •  కొలుసు పార్థసారథి 2009-14 మధ్య కాంగ్రెస్‌ ప్రభుత్వంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య, పశువైద్య విశ్వవిద్యాలయాలు, తర్వాత మాధ్యమిక విద్యాశాఖల మంత్రిగా సేవలందించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని