AP Assembly: 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు

రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని అయిదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు.

Updated : 09 Jul 2024 04:17 IST

5 రోజుల పాటు నిర్వహించే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. వీటిని అయిదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది. తొలి రోజు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగించనున్నారు. తర్వాత రోజుల్లో గవర్నర్‌ ప్రసంగంపై చర్చ, ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించి, పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఖరారు చేసేందుకు సమయం సరిపోని కారణంగా.. ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లేదు. ఎన్నికల ముందు గత వైకాపా ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ఈ నెల 31 వరకు ఉంటుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏయే పథకాలను ఎప్పుడెప్పుడు, ఎలా అమలుచేయాలనే అంశాలపై కసరత్తు చేస్తోంది. ఇది కొలిక్కి వస్తే బడ్జెట్‌పై స్పష్టత రానుంది. దాంతో మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్‌ కోసం ఆర్డినెన్స్‌ తీసుకువచ్చే అవకాశం ఉంది. సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రభుత్వం సిద్ధం చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని