AP Assembly: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు.

Updated : 21 Jun 2024 06:57 IST

తొలుత సీఎం చంద్రబాబు, తరువాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం

ఈనాడు, అమరావతి: శాసనసభ సమావేశాలు శుక్రవారం ఉదయం 9.46 గంటలకు ప్రారంభం కానున్నాయి. తొలుత ప్రొటెం స్పీకర్‌ నియామకంపై అసెంబ్లీ కార్యదర్శి ప్రకటన చేస్తారు. అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి రిజిస్టర్లలో సంతకాలు చేస్తారు. ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు, తర్వాత డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు. మాజీ సీఎం, వైకాపా అధ్యక్షుడు జగన్‌ సాధారణ సభ్యుడిగానే ప్రమాణం చేస్తారు. ఆంగ్ల అక్షరాల వరుసక్రమంలో సభ్యులను పిలుస్తారు. అనంతరం శాసనసభ సభాపతి ఎన్నికల ప్రక్రియను ప్రకటిస్తారు.

ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో సహా ఎవరికీ విజిటింగ్‌ పాస్‌లు జారీ చేయడం లేదని అసెంబ్లీ అధికారులు ప్రకటించారు. స్థలాభావం కారణంగా విజిటింగ్‌ పాస్‌ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని