Chandrababu: చంద్రబాబుకు కళ్లద్దాలిచ్చి.. మురిసిపోయిన మహిళ

మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 16 Jun 2024 10:10 IST

సీఎంకు కళ్లద్దాలు బహూకరించి.. ఉత్సాహంగా నినాదాలు చేస్తున్న మహిళ  

ఈనాడు, అమరావతి: మిమ్మల్ని సీఎంగా చూడాలని ఐదేళ్లుగా మేం చేయని పూజలు లేవని పలువురు మహిళలు చంద్రబాబుతో చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు. చాలామంది పాదాభివందనం చేయబోగా ఆయన వారించారు. ఓ మహిళ అభ్యర్థన మేరకు చంద్రబాబు నల్ల కళ్లద్దాలు పెట్టుకోగా అక్కడున్న వారంతా సీఎం బాబు అనే నినాదంతో హోరెత్తించారు. సామాజిక భద్రతా పింఛన్‌ను రూ.మూడు వేల నుంచి రూ.నాలుగు వేలకు పెంచడంపై పలువురు వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. మెగా డీఎస్సీ హామీ అమలుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేయడంతో పలువురు నిరుద్యోగ యువకులు బృందాలుగా వచ్చి శాలువాతో ఆయన్ను సత్కరించి, కృతజ్ఞతలు తెలిపారు. ‘ఏం చదువుతున్నారు.. ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు’ అంటూ వారి వివరాల్ని చంద్రబాబు తెలుసుకున్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి అధినేతతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, ప్రత్తిపాటి పుల్లారావు, బీద రవిచంద్రయాదవ్, బండారు సత్యనారాయణమూర్తి, బొండా ఉమామహేశ్వరరావు, థామస్, పలువురు సీనియర్‌ నేతలు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు