Free Bus Scheme: ఏపీలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై కసరత్తు

రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని  రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు.

Published : 16 Jun 2024 05:48 IST

ఇతర రాష్ట్రాలలో అమలు తీరును పరిశీలిస్తాం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి

రాయచోటి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంపై కసరత్తు చేస్తున్నామని  రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాదరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి చేపట్టిన ఆయన తొలిసారి తన సొంత నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రాయచోటికి శనివారం వచ్చారు. ర్యాలీకి ముందు ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు. అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసి, ఎలాంటి పొరపాట్లు లేకుండా రాష్ట్రంలో త్వరలోనే అమలు చేసేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి నారా లోకేశ్‌ను శుక్రవారం కలిసినప్పుడూ దీనిపై చర్చించాం. ఇచ్చిన హామీని పకడ్బందీగా అమలుచేస్తాం’ అని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని