AP High Court: కొత్త సినిమా టికెట్‌ ధరల పెంపుపై లోతైన విచారణ: ఏపీ హైకోర్టు

కొత్త సినిమాల టికెట్‌ ధరలను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అనే విషయాన్ని తేలుస్తామని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది.

Updated : 11 Jul 2024 08:02 IST

ఈనాడు, అమరావతి: కొత్త సినిమాల టికెట్‌ ధరలను పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా.. లేదా.. అనే విషయాన్ని తేలుస్తామని, ఈ వ్యవహారంపై లోతైన విచారణ చేస్తామని హైకోర్టు పేర్కొంది. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేయాలని ప్రభుత్వాన్ని, ఇతర ప్రతివాదులను ఆదేశించింది. సినిమా టికెట్‌ ధరల విషయంలో గతంలో దాఖలైన వ్యాజ్యంతో ప్రస్తుత పిల్‌ను జత చేయాలని రిజిస్ట్రీకి స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కల్కి సినిమా టికెట్ల ధరలను    14 రోజులపాటు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెమోను సవాలు చేస్తూ పి.రాకేశ్‌రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిల్‌ వేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేసేందుకు మరికొంత సమయం కావాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని