Vangalapudi Anitha: మహిళలకు రక్షణ కల్పిస్తాం.. రాష్ట్ర హోం మంత్రి అనిత

భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.

Published : 16 Jun 2024 04:28 IST

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హోంమంత్రి అనిత

అంతర్వేది, న్యూస్‌టుడే: భూకబ్జాలు, దాడులు.. మహిళలపై అఘాయిత్యాలు, ఆడపిల్లల అపహరణలు జరక్కుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ల ఆధ్వర్యంలో మహిళలతో పాటు సామాన్య ప్రజలకూ రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అంతర్వేదిలోని లక్ష్మీనరసింహస్వామి, కాకినాడ జిల్లా అన్నవరంలోని సత్యనారాయణస్వామిని శనివారం ఆమె దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అంతర్వేదిలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడపడానికి చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌లకు, కేంద్రంలో పీఎం మోదీకి మనోధైర్యాన్ని అందించాలని లక్ష్మీనరసింహస్వామిని తాను కోరుకున్నట్లు తెలిపారు. గత వైకాపా పాలనలో స్త్రీలకు రక్షణ కరవైందని.. రాష్ట్రంలో మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెరిగాయని వివరించారు. భూ కబ్జాలు, దాడులకు హద్దు లేకుండా పోయిందని.. వాటన్నింటినీ సరిదిద్దుతామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని