AP News:అమ్మకు... ఎంత కష్టమొచ్చింది..

ఒళ్లంతా గాయాలు... పట్టుకుంటే వణికిపోతోంది... విపరీతమైన జ్వరం, ఎముకల గూడులా కనిపిస్తున్న ఓ వృద్ధురాలిని ఎవరో కఠినాత్ములు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. ఈ సంఘటన

Updated : 26 Dec 2021 05:08 IST

వృద్ధురాలిని ముళ్ల కంచెలో పడేశారు

ఈనాడు, ఈటీవీ చొరవతో సీహెచ్‌సీకి తరలింపు

కనిగిరి, న్యూస్‌టుడే: ఒళ్లంతా గాయాలు... పట్టుకుంటే వణికిపోతోంది... విపరీతమైన జ్వరం, ఎముకల గూడులా కనిపిస్తున్న ఓ వృద్ధురాలిని ఎవరో కఠినాత్ములు ద్విచక్ర వాహనంపై తీసుకొచ్చి ముళ్ల పొదల్లో పడేసి వెళ్లారు. ఈ సంఘటన శనివారం ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని మినీ క్రీడా స్టేడియం సమీపంలో చోటు చేసుకుంది. ఇక అమ్మతో పని లేదు అనుకున్నారో.. ఆ వృద్ధురాలికి ఓ ముద్ద ఎందుకు దండగ అని భావించారో ఏమో. అలా వదిలేసి వెళ్లారు. అటుగా వెళుతున్న విద్యార్థులు గమనించి ‘ఈనాడు-ఈటీవీ’కి సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న ‘న్యూస్‌టుడే’ ప్రతినిధి స్నేహహస్తం ప్రతినిధులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ఆమెకు సపర్యలు చేసి 108లో సీహెచ్‌సీకి తరలించారు. ఆసుపత్రిలో స్పృహలోకి వచ్చిన ఆ వృద్ధురాలిని పేరు అడగ్గా తన పేరు సాబీరా అని, తనకు కుమారుడు ఉన్నాడని వెల్లడించారు. ఎవరు నిన్ను ముళ్లపొదల్లో పడేశారన్న ప్రశ్నకు మాత్రం ఆమె మౌనం వహించారు. ఆమె ఆరోగ్యం కుదట పడ్డాక ఒంగోలుకు తరలిస్తామని తహసీల్దారు ఉయ్యాల పుల్లారావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని