AP News:నేటి నుంచి పింఛను పెంపు

వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు శనివారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పింఛను మొత్తంరూ.2,500 కానుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించే కార్యక్రమంలో

Updated : 01 Jan 2022 03:17 IST

గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రారంభించనున్న ముఖ్యమంత్రి జగన్‌

ఈనాడు డిజిటల్‌, అమరావతి: వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు తదితరులకు రూ.250 పింఛను పెంపు శనివారం నుంచి అమల్లోకి రానుంది. దీంతో పింఛను మొత్తం
రూ.2,500 కానుంది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్‌ దీన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నారు. ఇందుకుగాను ప్రభుత్వం రూ.1,570 కోట్లు విడుదల చేసింది. లబ్ధిదారుల ఎంపికలో అత్యంత పారదర్శక విధానాన్ని అమలు చేస్తున్నామని ప్రభుత్వం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని