- TRENDING TOPICS
- Ind vs Zim
- Monkeypox
AP News: అనామతు చెల్లింపులే!
జనవరి జీతాలకు ఇదే పద్ధతి..
ఈ ఆర్థిక సంవత్సరంలో బిల్లులు, వేతనాలకు రెండుసార్లు..
తొలుత సర్దుబాట్లు..ఆనక కొత్త బిల్లులు
డీడీవోల ఆపసోపాలు
ఈనాడు - అమరావతి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎప్పుడూ లేని విధంగా జనవరి నెల జీతాలను అనామతు ఖాతా నుంచి చెల్లించారు. జీతాల హెడ్ ఆఫ్ అకౌంటు 010 పద్దు ఉండగానే అనామతు ఖాతా 8658 ద్వారా చెల్లింపులు సాగాయి. జీతాల పద్దు ఉండగా ఇలా అనామతు ఖాతాల ద్వారా రూ.వందల కోట్ల చెల్లింపులు చేయడమేంటనే ప్రశ్న వినిపిస్తోంది. సాధారణంగా దేనికీ చెందని, అనేక సందేహాలున్న మొత్తాలను అనామతు ఖాతాలో జమ చేస్తుంటారు. ఆనక వాటిని సర్దుబాటు చేస్తుంటారు. రాష్ట్రంలో సీఎఫ్‌ఎంఎస్ వ్యవస్థ వచ్చాక ఇలా అనామతు ఖాతాల ద్వారా చెల్లింపులు దాదాపు లేవని ఆర్థికశాఖలో గతంలో పనిచేసిన వారు చెబుతున్నారు. ఎంతో అవసరమైతే తప్ప అలా చెల్లింపులు చేయరని పేర్కొంటున్నారు.
అనామతు ఖాతాను పూర్తిగా నియంత్రించినందుకు ఏపీ ఆర్థికశాఖను అభినందిస్తూ గతంలో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధికారులు లేఖ రాశారని తర్వాత కొద్ది రోజులకే చెల్లింపులు సాగాయని పేర్కొంటున్నారు.
ఏప్రిల్‌లో...:
ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెల మొదటి రెండు రోజుల్లోనే అనామతు ఖాతా నుంచి దాదాపు రూ.3,000 కోట్లను చెల్లించారు. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజున బిల్లుల చెల్లింపులకు చివరి నిమిషంలో రిజర్వుబ్యాంకుకు వర్తమానం పంపారు. ఆ మేరకు చెల్లింపులు జరగలేదు. ఆరోజు అర్ధరాత్రితో ఆర్థిక సంవత్సరం ముగిసింది. ఆ ఆర్థిక సంవత్సరంలో ఆమోదం పొందిన బడ్జెట్ ప్రకారం చెల్లింపులకు మార్చి 31 ఆఖరు తేదీ. ఆ మర్నాడు చెల్లింపులకు వీల్లేదు. ఆర్‌బీఐ ఆరోజు ఆమోదించని మొత్తానికి, మరికొన్ని బిల్లుల చెల్లింపులకు ఆర్థికశాఖ అధికారులు అనామతు ఖాతా ఎంచుకున్నారు. మొదట ఆ మొత్తాలను అనామతు ఖాతాకు బదిలీ చేసి ఆ తర్వాత ఏప్రిల్ మొదటి వారంలో చెల్లింపులు జరిపారు. ఈ వ్యవహారంపై తీవ్ర విమర్శలు రేగాయి. అనామతు ఖాతా ద్వారా చెల్లింపుల సమాచారం బయటపడిందని ఆర్థికశాఖ అధికారులు అప్పట్లో ఆందోళన చెందారు. అలాంటిది ఇప్పుడు జనవరి నెల జీతాలకు ఏకంగా రూ.వేల కోట్లు అనామతు ఖాతా ద్వారా చెల్లించడం చర్చనీయాంశమవుతోంది.
వేల మంది చేయాల్సిన పనిని...
* సాధారణంగా ఉద్యోగుల జీతాలకు రాష్ట్రంలోని డ్రాయింగ్ డిస్‌బర్సుమెంటు అధికారుల (డీడీవోలు) వద్ద బిల్లులు సిద్ధంచేసి వారు ఆమోదించాక ఖజానా అధికారులకు పంపి అక్కడ ఆమోదింపజేస్తారు. ఆ తర్వాతే సీఎఫ్‌ఎంఎస్‌కు వెళ్లి చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమవుతుంది.
* జనవరి జీతాల విషయంలో డీడీవోలు సహకరించక పోవడం, ఖజానాకు కొత్త జీతాల బిల్లులు రాకపోవడంతో ప్రభుత్వం అనామతు ఖాతా ద్వారా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని డీడీవోలంతా చేయాల్సిన పనిని ఖజానా శాఖ డైరెక్టర్ ఒక్కరికే అప్పచెప్పింది. ఖజానా అధికారులు చేయాల్సిన పనిని పే అండ్ అకౌంటు అధికారి ఒక్కరే చేసేలా ఉత్తర్వులు ఇచ్చింది.
* జీతాల పద్దు ద్వారా డీడీవోలు చెల్లింపులు చేయాల్సి ఉండగా అందుకు అవకాశం దక్కక పోవడంతో ఎంహెచ్ 8658 అనామతు ఖాతా ద్వారా లక్షల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించేశారు.
* ఇప్పుడా అనామతు చెల్లింపులను సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముందు డీడీవోలంతా జనవరి జీతాల సర్దుబాటు బిల్లులు చేసి ఆమోదించాలి. జీతాల హెడ్ నుంచి డెబిట్ చేసి సస్పెన్స్ హెడ్‌కు క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. డీడీవోలు ఆ సర్దుబాటు బిల్లులు ఖజానా అధికారులకూ పంపితే వారు ఈ అనామతు ఖాతా బిల్లులను ఆమోదించాల్సి ఉంటుంది.
ఒకరోజు గడిచినా..
2022 సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం డీడీవోలు వేతన స్థిరీకరణ నిర్వహించాలి. పైన పేర్కొన్న సర్దుబాటుతోపాటు ప్రతి ఉద్యోగికీ ఇవ్వాల్సినవి, మినహాయించాల్సినవి సరిచేసి ఫిబ్రవరి జీతాల బిల్లులు సిద్ధం చేయాలి. ఈ పని అంతా 5 రోజుల్లో పూర్తి కావాలని ఆదేశాలిచ్చారు. డీడీవోలు పని చేసేందుకు అనువుగా సంబంధిత హెర్బ్ పే రోల్ మాడ్యూల్ సోమవారం సాయంత్రానికీ చాలామందికి అందుబాటులోకి రాలేదని తెలిసింది. మిగిలిన నాలుగు రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనా అని కొందరు డీడీవోలు ఆందోళన చెందుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Sports News
Virat Kohli: విరాట్ కోహ్లీ @ 14 ఇయర్స్.. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా!
-
Politics News
Andhra news: రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్
-
General News
Andhra News: ఏపీ ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల అప్పు
-
India News
Maharashtra: సముద్రతీరంలో ఆయుధాలతో పడవ గుర్తింపు.. హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు
-
Movies News
Liger: ‘లైగర్’ సినిమా.. ఏడు అభ్యంతరాలు చెప్పిన సెన్సార్ బోర్డ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Vinod kambli: బీసీసీఐ పింఛనే నాకు దిక్కు.. సచిన్ నుంచి ఏమీ ఆశించట్లేదు: వినోద్ కాంబ్లి
- DK : ఆయన ఓటమిని అస్సలు తట్టుకోలేడు.. సహనం తక్కువే.. కానీ!
- Liger: లైగర్ ఓటీటీ ఆఫర్ ఎందుకు వదులుకున్నారు?
- Andhra News: వివాహితను భయపెట్టి నగ్న వీడియో కాల్..
- అజిత్ డోభాల్ ఇంటి వద్ద వ్యక్తి హల్చల్ ఘటన.. ముగ్గురు కమాండోలపై వేటు
- Vizag: విశాఖలో రౌడీషీటర్ హత్య.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘాతుకం
- Madhavan: ‘రాకెట్రీ.. మాధవన్ ఇంటిని కోల్పోయాడు’
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (18/08/2022)
- Viral video: యూనిఫాంలో పోలీసుల ‘నాగిని డ్యాన్స్’.. వైరల్‌గా మారిన వీడియో
- Wipro: వేతనాల పెంపు ఆపట్లేదు.. 3 నెలలకోసారి ప్రమోషన్!