AP News: రాష్ట్రానికేదీ హైస్పీడ్‌

దేశంలోని పలు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్లు నిర్మించే కసరత్తు సాగుతుంటే.. మన రాష్ట్రానికి అందులో చోటు లభించడం లేదు. 5 కోట్ల జనాభా, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ముఖ్యమైన నగరాలు, వివిధ వ్యవసాయ, వాణిజ్య కేంద్రాలు, 5 నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండి, నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే కీలక మార్గాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వీటిని రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోవడంలేదు. విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్‌, చెన్నై మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది.

Updated : 17 May 2022 10:03 IST

రైలు కారిడార్లలో దక్కని చోటు
రద్దీ ఉన్నప్పటికీ దృష్టిపెట్టని రైల్వేశాఖ
పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఈనాడు - అమరావతి

దేశంలోని పలు నగరాల మధ్య హైస్పీడ్‌ రైలు కారిడార్లు నిర్మించే కసరత్తు సాగుతుంటే.. మన రాష్ట్రానికి అందులో చోటు లభించడం లేదు. 5 కోట్ల జనాభా, విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి వంటి ముఖ్యమైన నగరాలు, వివిధ వ్యవసాయ, వాణిజ్య కేంద్రాలు, 5 నౌకాశ్రయాలు ఉన్న రాష్ట్రాన్ని రైల్వేశాఖ చిన్నచూపు చూస్తోంది. ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండి, నిత్యం ఎక్కువ సంఖ్యలో రైళ్లు నడిచే కీలక మార్గాలు రాష్ట్రంలో ఉన్నప్పటికీ వీటిని రైల్వేశాఖ పరిగణనలోకి తీసుకోవడంలేదు. విజయవాడ నుంచి విశాఖ, హైదరాబాద్‌, చెన్నై మార్గాల్లో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుంది. రాయలసీమ వాసులు గుంటూరు, విజయవాడకు చేరుకునేందుకు బెంగళూరు- విజయవాడ లైన్‌ కీలకమైనది. ఆయా మార్గాల్లో రైళ్ల వేగం గరిష్ఠంగా 110-120 కి.మీ. మించి లేకపోవడంతో ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోంది. అదే హైస్పీడ్‌ రైలు కారిడార్‌ వస్తే ఇప్పుడున్న ప్రయాణ సమయంలో నాలుగింట మూడొంతులు తగ్గుతుంది. ఏపీ మాదిరిగానే భౌగోళిక ప్రాంతం ఉండే కేరళలో.. సుదూర ప్రాంతానికి వేగంగా చేరుకునేందుకు సెమీ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టును చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని నగరాలను కలుపుతూ హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టులు చేపడుతుంటే.. మన రాష్ట్రంలోని వివిధ నగరాలకు వీటిని తీసుకురావడంపై ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. వీటి అవసరాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి ప్రాజెక్టులు మంజూరు చేయాలంటూ ఒత్తిడి చేయాల్సిన నేతలు.. దీనిపై దృష్టిపెట్టడం లేదు. పొరుగు రాష్ట్రాలకు హైస్పీడ్‌ రైలు కారిడార్లు వస్తుంటే, రాష్ట్రంలో ఆ ఊసే కనిపించడంలేదు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని