Ayyannapatrudu: ఏపీ శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు

శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఇవి రెండు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది.

Updated : 18 Jun 2024 18:25 IST

21 నుంచి ఏపీ అసెంబ్లీ..

సభ్యుల ప్రమాణస్వీకారం.. సభాపతి, ఉపసభాపతి ఎన్నిక 

ఈనాడు, అమరావతి: శాసనసభ సమావేశాలు ఈ నెల 21న ప్రారంభం కానున్నాయి. ఇవి రెండు రోజులపాటు జరిగే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సభ్యుల ప్రమాణస్వీకారం, సభాపతి, ఉపసభాపతి ఎన్నిక జరుగుతుంది. సభాపతిగా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని తెదేపా అధిష్ఠానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్‌విప్‌పై స్పష్టత రాలేదు. ఎన్నికైన వారిలో సీనియారిటీపరంగా అయ్యన్నపాత్రుడు ముందుంటారు. ఆయన సభాపతిగా ఎన్నికవుతున్న నేపథ్యంలో మరో సీనియర్‌ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలకు ముందు సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని