Bharat Biotech: బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా!

కొవిడ్‌- 19 వ్యాధికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చినట్లు తెలిసింది.

Updated : 26 Nov 2022 09:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌- 19 వ్యాధికి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన చుక్కల మందు టీకా ‘ఇన్‌కొవాక్‌’ను బూస్టర్‌ డోసుగా వినియోగించేందుకు డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) అత్యవసర అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. దీన్ని ‘ఫైవ్‌ ఆర్మ్స్‌’ బూస్టర్‌ డోసుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత అనుమతి ప్రకారం.. ఇప్పటికే రెండు డోసుల కొవాగ్జిన్‌  /కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారు.. 6 నెలల తర్వాత బూస్టర్‌ డోసుగా ఈ చుక్కల మందు టీకా తీసుకోవచ్చు. దీన్ని భారత్‌ బయోటెక్‌, యూఎస్‌లోని వాషింగ్టన్‌ వర్సిటీ- సెయింట్‌ లూయీస్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. మనదేశంలో 18 ఏళ్ల వయసు దాటిన వారు ఈ టీకా వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని